Abhishek Bachchan | ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఎప్పుడు కలిసి ఎక్కడా కనిపించలేదు. అలాగే, అభిషేక్ బచ్చన్ ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో సైతం కనిపించేలదు. అయితే, తాజాగా అభిషేక్ ఐశ్వర్యరాయ్‌కి ధన్యవాదాలు చెప్పాడు. మరోసారి వైవాహిక జీవితంపై స్పందించాడు. అభిషేక్ ఇటీవల ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీ ప్రదర్శనలతో విమర్శకులను ఎలా సైలెంట్ చేస్తున్నారు ? ఇది ఎలా సాధ్యమవుతుంది ? అంటూ యాంకర్ ప్రశ్నించారు. దీనికి అభిషేక్ సమాధానం ఇస్తూ.. ఇది చాలా సాధారణమైన విషయమని చెప్పాడు.
విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని.. దర్శకులు చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్తానని చెప్పాడు. మన పనేంటో మనం చేసుకొని సెలెంట్‌గా ఇంటికి వెళ్లడమేనంటూ వ్యాఖ్యానించాడు. దీనికి యాంకర్ స్పందిస్తూ తాను సైతం ఇంట్లో ఇదే విధానాన్ని పాటిస్తానని.. భార్య మాటేవింటానని చెప్పగా నవ్వులు విరిశాయి. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ భార్య ఏం చెబితే అదే చేయాలని.. పెళ్లయిన ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం, అభిషేక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల ‘ఐ వాంట్ టు టాక్’ సినిమా ఇంటర్వ్యూలో సైతం ఐశ్వర్యపై అభిషేక్ ప్రశంసలు కురిపిస్తూ థ్యాంక్స్ చెప్పాడు. ఐశ్వర్య ఆరాధ్యతో ఇంట్లో ఉంటుందని.. తాను సినిమాల్లో నటించేందుకు బయటకు వెళ్లే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఐశ్వర్య రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బర్త్ డే వేడుకలకు హాజరుకాకపోయినా.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో ఐశ్వర్య తన వివాహం రోజున ధరించిన ఉంగరం పెట్టుకోవడం కనిపించింది. ఇటీవల విడాకులు వార్తలు వస్తున్నా.. ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.