Aishwarya-Abhishek | రూమర్స్‌కు చెక్.. ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య – అభిషేక్ జంట.. ఫొటోలు వైరల్
Aishwarya-Abhishek | బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) విడాకులు తీసుకోబోతున్నారంటూ (Separation Rumours) గత కొంత కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
Aishwarya-Abhishek | బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) విడాకులు తీసుకోబోతున్నారంటూ (Separation Rumours) గత కొంత కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఐశ్వర్య – అభిషేక్ జంట ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. వీరిద్దరూ కలిసి తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లు ధరించి ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఐశ్వర్య తల్లి బృంద్య, అను రంజన్‌తో కలిసి ఈ స్టార్ జంట సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నదంటూ ఇటీవల వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అభిషేక్ నటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్లో ఉన్నాడని.. ఈ క్రమంలోనై ఐష్ నుంచి విడిపోనున్నట్లుగా బాలీవుడ్ కోడై కూస్తున్నది. ఈ క్రమంలోనే ఏ పార్టీకి హాజరైనా బచ్చన్ ఫ్యామిలీ కుటుంబంతో సహా హాజరవుతున్నా.. ఐశ్వర్య మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా హాజరవడం ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. అలాగే, ఒక్కగానొక్క కూతురు ఆరాధ్య బర్త్ డే వేడుకలకు సైతం అభిషేక్ దూరంగా ఉన్నాడు. దీంతో ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయం అని అందరూ భావించారు. ఇంతలోనే ఇద్దరూ ఓ కార్యక్రమానికి హాజరై ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు.
అభిషేక్- ఐశ్వర్యరాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జంటకు ఆరాధ్య జన్మించింది. ఇటీవల ఆరాధ్య 13వ పుట్టిన రోజును తల్లి ఐశ్వర్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నది. అయితే, బర్త్‌డే పార్టీ వేడుకల్లో అభిషేక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య ఆరాధ్య పుట్టిన తర్వాత ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. 2015లో జబ్బా సినిమాలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ఎంపిక చేసిన చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నది. సర్బ్జిత్, ఏదిల్ హై ముష్కిల్, ఫన్నీ ఖాన్, పొన్నియన్ సెల్వన్ తదితర ఫ్రాంచైజీల్లో నటించింది.
Also Read..
Keerthy Suresh | ఆంటోనితో వెడ్డింగ్.. అప్డేట్ ఇచ్చిన కీర్తి సురేశ్
Rajya Sabha | రాజ్యసభలో నగదు కలకలం.. తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట
Repo Rate | వరుసగా 11వ సారి.. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ లేదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

