Rs.500 Notes | పెద్ద ఎత్తున చెలామణీలోకి ఫేక్ రూ.500 నోట్లు.. ఎలా గుర్తించాలంటే..?
Rs.500 Notes | రూ.500 నోట్ల (Rs.500 Notes) విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఫేక్ రూ.500 నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది.
Rs.500 Notes | రూ.500 నోట్ల (Rs.500 Notes) విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఫేక్ రూ.500 నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించింది.
ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత, అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వాటిని గుర్తించడం సులభం కాదని, చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. అయితే, ఈ నకిలీ నోట్లలో ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని.. దాన్ని గుర్తించడమే కీలకమని తెలిపింది. ‘RESERVE BANK OF INDIA’ అనే పదంలో ‘RESERVE’ పదంలో ‘E’కి బదులు ‘A’ పడినట్లు వెల్లడించింది. నోటును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తప్పును గుర్తించొచ్చని తెలిపింది. తద్వారా అది ఫేక్ నోటా లేక ఒరిజినల్ నోటా అనేది తెలుస్తుందని సూచించింది. ఈ ఫేక్ నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లో చెలామణీ అవుతున్నట్లు తెలిపింది. వాటి ఖచ్చిత సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని పేర్కొంది. వీటి విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read..
Debentures | డిబెంచర్లు అంటే? వాటిలో ఎన్ని రకాలుంటాయో తెలుసా?
Market Pulse | ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయంటే..
Bullion Market | బులియన్లో పెట్టుబడులు.. ఉన్న లాభాలేంటి?.. అనుసరించాల్సిన వ్యూహాలేంటి?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

