Debentures | డిబెంచర్ అంటే ఓ రుణ సాధనం. సాధారణంగా మదుపరుల నుంచి నిధుల సమీకరణ కోసం కంపెనీలు లేదా ఆర్థిక సంస్థలు వీటిని జారీ చేస్తాయి. ప్రభుత్వాలు సైతం వీటిని వినియోగించుకోవచ్చు. ఈ డిబెంచర్లకు తాకట్టుగా ఎటువంటి ఆస్తులూ ఉండవు. జారీచేసేవారి పరపతి, విశ్వసనీయత మీదే ఇవి ఆధారపడి ఉంటాయి. ఇక ఈ డిబెంచర్లలో అనేక రకాలుంటాయి. వాటిని పరిశీలిస్తే..
నిర్ణీత వ్యవధి తర్వాత కంపెనీ ఈక్విటీ షేర్లలోకి డిబెంచర్‌ను మార్చుకొనే వెసులుబాటు మదుపరులకు ఉంటుంది. దీంతో అప్పటిదాకా ఆ కంపెనీకి రుణదాతలుగా ఉన్న డిబెంచర్హోల్డర్లు.. షేర్‌హోల్డర్లుగా మారుతారు. అప్పుడు ఇవి మార్కెట్ లింక్డ్ డిబెంచర్ ఫీచర్లని సంతరించుకుంటాయి. స్టాక్ మార్కెట్లలో సదరు షేర్ల విలువ పెరిగితే లాభాలు, తగ్గితే నష్టాలు డిబెంచర్లు కొన్నవారికి వస్తాయన్నమాట.
ఇవి ఈక్విటీ షేర్లుగా మారవు. కాలపరిమితి మొత్తం నిర్దిష్ట ఆదాయంతోనే ఉంటాయి. మెచ్యూరిటీ వరకు ముందుగా నిర్ణయించిన వడ్డీరేటు ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి.
ఈ డిబెంచర్లను జారీచేసేవారు డిబెంచర్ హోల్డర్ల వివరాలను నమోదు చేసుకుంటారు. ఓ రిజిస్టర్లో వారి పేరు, చిరునామా, మొబైల్/ఫోన్ నెంబర్లు తదితర వివరాలను రికార్డ్ చేస్తారు. ఇవి మదుపరులకు ఓ స్థాయి భద్రతను కల్పిస్తాయి.
వీటిని జారీచేసేవారి దగ్గర వ్యక్తిగత డిబెంచర్హోల్డర్ల వివరాలేవీ ఉండవు. అయితే ఇవి సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్‌కు చాలా అనువైనవి. వీటి బదలాయింపు ఎంతో సులువు.
వీటికి నిర్ణీత మెచ్యూరిటీ తేదీలుంటాయి. కాలపరిమితి తీరిన తర్వాత వాటి ముఖ విలువతో డిబెంచర్హోల్డర్ల నుంచి జారీచేసినవారు తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దశలవారీగా లేదా మెచ్యూరిటీ సమయంలోనైనా వడ్డీ ఆదాయాన్ని తీసుకోవచ్చు.
వీటికి నిర్ణీత మెచ్యూరిటీ తేదీలుండవు. జారీచేసినవారు తిరిగి కొనాల్సిన పనిలేదు. అయితే దశలవారీగా లేదా మెచ్యూరిటీ సమయంలోనైనా వడ్డీ ఆదాయాన్ని తీసుకోవచ్చు.
కంపెనీ ఆస్తుల దన్నుతో ఈ డిబెంచర్లుంటాయి. ఒకవేళ వీటిని జారీచేసినవారు చెల్లింపుల ఎగవేతలకు పాల్పడితే.. ఇన్వెస్టర్లు సదరు ఆస్తులను అమ్ముకొని తమ పెట్టుబడులను తిరిగి పొందవచ్చు.
వీటికి ఎలాంటి ఆస్తుల భద్రతా ఉండదు. కంపెనీల ఆర్థిక స్థోమత, పరపతి మీదే చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. భారీ రాబడులకు వీలున్నా.. రిస్క్ ఎక్కువ. ఇవేగాక ప్రిఫర్డ్, ఆర్డినరీ, పాక్షిక కన్వర్టబుల్ డిబెంచర్లూ ఉంటాయి.
01