ములుగు : ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండ లంలోని లింగాపూర్ అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తిరుగుతున్న పెద్దపులి అటవీ మార్గన పక్కనే ఉన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అటవీ ప్రాంతం గుండా లింగాపూర్ గ్రామానికి చేరుకొని సమీప అడవులలో తిరుగుతున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా వెళ్లకూడదని, సాయంత్రం త్వరగా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. కాగా, పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులిని బంధించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | సరూర్ నగర్లో ప్రేయసిని చంపేసిన పూజారికి జీవిత ఖైదు
Devara Movie | జపాన్లో ‘దేవర’ ప్రమోషన్స్.. అభిమానులతో వీడియో పంచుకున్న తారక్
BJP | నకిలీకి కేరాఫ్ బీజేపీ.. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న టాప్-10 ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్లు