Hyderabad | సరూర్ నగర్లో ప్రేయసిని చంపేసిన పూజారికి జీవిత ఖైదు
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని అత్యంత దారుణంగా చంపేసిన పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు పడింది. ఇరువైపులా వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు బుధవారం నాడు తీర్పును వెలువరించింది.
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని అత్యంత దారుణంగా చంపేసిన పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు పడింది. ఇరువైపులా వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు బుధవారం నాడు తీర్పును వెలువరించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం నరేంద్ర పురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నాడు. స్థానికంగా మైసమ్మ దేవాయంలో పూజారిగా ఉంటూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివాసముం టున్నది. గతంలో పలు సినిమాలు, సీరియ ల్స్‌లో చిన్న పాత్రల్లో నటించిన అప్సర ప్రస్తు తం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నది.
భక్తురాలిగా పరిచయమై…
పూజారి సాయికృష్ణ పని చేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని అప్సర తరచూ సాయికృ ష్ణపై ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. పథకం ప్ర కారం 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలం లోని సుల్తాన్‌పల్లి శివారులోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి చేరుకున్నాడు. కారులోనే గాఢనిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్‌తో ఊపిరి ఆడకుండా చే సేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో మృతదేహం
అప్సర మృతదేహాన్ని కారు బాడీ కవరులో చుట్టి డిక్కీలో వేసుకొని ఇంటి వద్దకు చేరుకున్నాడు. సాయంత్రం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్‌నగర్ ఎమ్మా ర్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురి గురిం చి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్‌లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్టు నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసి నా స్పందించడంలేదని నటించాడు. ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Apsara
- Hyderabad
- Local news
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

