Devara Movie Japan Release | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు మేకర్స్.
ఎన్టీఆర్ గత చిత్రాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ విడుదలైన బాద్షాతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమాను జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా జపాన్‌కి వెళ్లిన ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ.. జపాన్ అభిమానులను కలవడంతో పాటు అక్కడి స్థానిక మీడియాలలో దేవర ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు. అయితే జపాన్ ప్రజల ప్రేమకు ఫిదా అయిన తారక్ తాజాగా వారితో ఉన్న ఒక వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. మీ ప్రేమతో నా మనసు నిండిపోయింది. జపనీస్ ప్రేక్షకులు మార్చి 28 నుండి సినిమా హాళ్లలో “దేవర”ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను అంటూ రాసుకోచ్చాడు.
Overwhelmed, Japan!
Can’t wait for the Japanese audience to experience #Devara in cinemas from March 28th. pic.twitter.com/IWOBxQkI8c— Jr NTR (@tarak9999) March 26, 2025