ములుగు : సమ్మక్క, సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సహచర మంత్రులు సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి పర్యటించారు. మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై గుత్తేదారు, అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఈ నెల 22 న వస్తామని, నిర్దేశిత ఆయా పనులు పూర్తి కావాలని అన్నారు. నాణ్యతతో రాజేపడేది లేదని, తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Kaantha | దుల్కర్ సల్మాన్ ‘కాంత’ మూవీ వివాదం.. ప్రముఖ నటుడి మనవడు పిటిషన్ దాఖలు
Kidney Rocket | ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. మదనపల్లె కేంద్రంగా దందా!