Shiva Child Artist | 36 ఏళ్ల తర్వాత ‘శివ’ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మను గుర్తుచేసుకున్న ఆర్జీవీ ..ఇప్పుడు ఏం చేస్తుంది?
Shiva Child Artist | నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘శివ’ అప్పట్లో ఇండియన్ సినిమాకే కొత్త దిశా నిర్ధేశం చేసింది. 35 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Shiva Child Artist | నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘శివ’ అప్పట్లో ఇండియన్ సినిమాకే కొత్త దిశా నిర్ధేశం చేసింది. 36 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, ఆర్జీవీ కలిసి సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆర్జీవీ, సినిమాలో నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చేసిన పోస్ట్ నెట్లో వైరల్ అవుతోంది. ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నయ్య పాత్రలో నటించిన మురళీ మోహన్ కూతురుగా సుష్మ అనే చిన్నారి నటించింది. సినిమాలో ఆమె “బాబాయ్” అంటూ నాగార్జున వెనక తిరుగుతూ కనిపించింది. ముఖ్యంగా నాగార్జున, సుష్మపై తెరకెక్కిన సైకిల్ ఛేజింగ్ సీన్ ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ నిలిచిపోయింది.
విలన్స్ వెంటపడే సన్నివేశంలో నాగార్జున, చిన్నారిని సైకిల్‌పై కూర్చోబెట్టి తప్పించుకునే సీన్ అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ఆ సీన్లో కనిపించిన ఆ చిన్నారి సుష్మ ఎలా ఉందో ఆర్జీవీ స్వయంగా రివీల్ చేశాడు. తన ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్లో సుష్మ ప్రస్తుత ఫోటోను షేర్ చేస్తూ.. శివలోని ఐకానిక్ సైకిల్ ఛేజింగ్ సీన్లో భయంతో కనిపించిన ఆ చిన్నారి సుష్మ ఇప్పుడు అమెరికాలో AI & Cognitive Science లో రీసెర్చ్ చేస్తోంది,” అని పేర్కొంటూ ఆమె ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశాడు. దానికి స్పందించిన సుష్మ..“థ్యాంక్యూ సర్! శివ లెగసీలో నన్ను గుర్తుంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఆ అనుభవం మర్చిపోలేనిది. అలాంటి గొప్ప సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నాగార్జున గారు, మీరు రీ రిలీజ్‌తో మరోసారి విజయం సాధించాలని కోరుకుంటున్నాను,అని రీట్వీట్ చేసింది.
సుష్మ పూర్తి పేరు సుష్మ ఆనంద్ అకోజు. తెలుగు అమ్మాయి అయినా ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది. ఆమె ట్విట్టర్లో ఎక్కువగా తన రీసెర్చ్ పనులకు సంబంధించిన పోస్టులు చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌లో ఉండడంతో, నెటిజన్లు ఇప్పుడు ఆమె గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ‘శివ’ రీ రిలీజ్ నవంబర్ 14న ప్రేక్షకులను మరోసారి థియేటర్లకు తీసుకురానుంది.
This is the grown up girl Sushma from the iconic cycle chase scene in SHIVA where she is sitting scared on the bar with @Iamnagarjuna cycling in tension .. @symbolicsushi is now doing research in AI and Cognitive Science in the USA pic.twitter.com/L69aSyCQPF
— Ram Gopal Varma (@RGVzoomin) November 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

