పరిగి, జూన్ 13 : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. పరిగి ఎస్ఐ సంతోశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి చెందిన ప్యాట నర్సింలు(30) గురువారం రాత్రి 11గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుడు ప్యాట జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Black Box | విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ లభ్యం.. విశ్లేషణ ప్రారంభించిన దర్యాప్తు బృందం
Thorrur | అత్తా, కోడళ్లు మాయ మాటలు మానేయండి.. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీలపై దళితుల ఆగ్రహం
Vijay Rupani: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. విజయ్ రూపానీకి కలిసిరాని లక్కీ నెంబర్ !