Black Box | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో (Ahmedabad Plane Crash) కీలకంగా మారిన బ్లాక్ బాక్సు (Black Box) లభ్యమైంది. విమానం కూలిన బిల్డింగ్ పైకప్పుపై బ్లాక్ బాక్సును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత ఈ బ్లాక్ బాక్సు లభ్యమైంది. దర్యాప్తు బృందం ఈ బ్లాక్ బాక్సు విశ్లేషణను ప్రారంభించింది.
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ విమానం హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలడంతో మరో 24 మంది మెడికోలు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. దీనిపై అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉంది.
విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ కీలకం..
విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ కీలకం అన్న విషయం తెలిసిందే. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. విమానం, హెలికాప్టర్ల ప్రమాదం జరిగేకంటే కనీసం రెండు గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలను ఈ బ్లాక్‌బాక్స్ స్టోర్ చేసుకుంటుంది. విమానాలు క్రాష్ అయినా ఇందులోని సమాచారం తొలగిపోదు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read..
Air India crash | భార్య చివరి కోరికను తీర్చేందుకు వచ్చి.. తిరిగిరానిలోకాలకు.. అనాథలైన పిల్లలు
Ahmedabad Plane Crash | ఐదుగురి మృతదేహాలను గుర్తించిన అధికారులు.. కుటుంబ సభ్యులకు అప్పగింత