Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను అధికారులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఐదుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. గుర్తించిన వారిలో గుజరాత్‌కు చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు (bodies of 5 victims handed over to families). ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. దీంతో అధికారులు డీఎన్ఏ శాంపిల్స్ ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు దాదాపు 70 నుంచి 80 మంది వైద్యుల బృందం పనిచేస్తోంది.
Also Read..
Black box | బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా
Ahmedabad Plane Crash | ప్రాణాలతో ఎలా బయటపడ్డానో నాకే తెలియదు.. విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు