Sumit Sabharwal | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు.
ఈ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయిన బంధువులు ఈ విషాద ఘటనను తలచుకుని బోరున విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ (Sumit Sabharwal) చివరి మాటలను తలచుకొని ఆయన వృద్ధ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఫ్లైట్ లండన్ బయల్దేరే ముందు సుమిత్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. లండన్ వెళ్లాక మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడని, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బోరున విలపించారు.
ప్రమాదం జరిగిన అనంతరం శివసేనకు చెందిన ఎమ్మెల్యే దిలీప్ లాండే గురువారం రాత్రి ముంబై శివారులోని పోవై ప్రాంతంలో ఉన్న సుమిత్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన తండ్రిని కలిసి ఓదార్చారు. రెండేళ్ల క్రితం సుమిత్ తల్లి మరణించడంతో.. 80 ఏండ్ల తండ్రి బాగోగులు అతడే చూసుకుంటున్నాడు. సుమిత్ ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇంట్లో అతని తండ్రి ఒక్కరే ఉంటున్నారు. దీంతో కొన్ని రోజులు క్రితం వయోభారంతో బాధపడుతున్న తన తండ్రికి ‘నాన్నా.. పైలట్ ఉద్యోగం మానేసి ఇక నిన్నే చూసుకుంటా’ అని సుమిత్ మాటిచ్చాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ తన కుమారుడు చెప్పిన మాటలను తరలచుకుని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, సుమిత్ సబర్వాల్‌కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది.
Also Read..
PM Modi | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ
PM Modi | విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ.. క్షతగాత్రులకు పరామర్శ
Air India | ముంబై టు లండన్.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం