Air India | ముంబై నుంచి లండన్ (Mumbai To London) బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా (Air India) విమానం వెనక్కి తిరిగొచ్చింది. ఫ్లైట్రాడార్24 (Flightradar24) ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఇవాళ తెల్లవారుజామున 5:39 గంటల సమయంలో ముంబై నుంచి లండన్‌కు బయల్దేరింది. దాదాపు మూడు గంటలు ప్రయాణించిన తర్వాత ముంబైకి తిరిగి వచ్చింది.
దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని (airspace) మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో విమానం వెనక్కి తిరిగి వచ్చినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు విమానాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. కాగా, గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం ఇరాన్‌పై (Iran) ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో దేశంలో అత్యవసర పరిస్థితులను ప్రకిటించింది. తాజా దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
Also Read..
PM Modi | అహ్మదాబాద్‌కు మోదీ.. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న ప్రధాని
Air India | విమానంలోని 241 మంది మృతిచెందారు.. ధృవీకరించిన ఎయిర్ఇండియా
విమానంలో భారీగా ఇంధనం: అమిత్‌షా