PM Modi | అహ్మదాబాద్‌కు మోదీ.. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న ప్రధాని
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ఇండియా (Air India) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi ) శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ఇండియా (Air India) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా దుర్మరణం పాలయ్యారు. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi ) శుక్రవారం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.
కాగా, ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్‌లో పెను విషాదం తనను ఎంతగానో కలచివేసిందని, మాటలు రావడం లేదని చెప్పారు. ఇది మాటలకందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించేనని తెలిపారు. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో టచ్‌లో ఉంటున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రదాద స్థలాన్ని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ పరిశీలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

