PM Modi | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రమేశ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరామర్శించారు.
#WATCH | Prime Minister Narendra Modi meets the lone survivor of yesterday’s #AirIndiaPlaneCrash.
241 of 242 who were onboard the plane lost their lives.
(Source – DD) pic.twitter.com/tVXoscmOPE
— ANI (@ANI) June 13, 2025
శుక్రవారం ఉదయం ప్రమాద స్థలిని సందర్శించిన మోదీ.. అక్కడి నుంచి నేరుగా సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ క్రమంలో విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్‌ను కూడా మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతడికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx
— ANI (@ANI) June 13, 2025
మృత్యుంజయుడు..
బ్రిటిష్ జాతీయుడైన (British national ) 38 ఏండ్ల రమేశ్ విమానంలో 11ఏ సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీటు ఉంటుంది. తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు వచ్చిన రమేశ్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్(45)తో కలసి లండన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని, అంతలోనే విమానం కూలిపోయిందని తెలిపాడు. అంతా క్షణాలలో జరిగిపోయింది అని రమేశ్ చెప్పుకొచ్చారు.
ప్రమాదంలో రమేశ్‌కు ఛాతీ, కళ్లు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అంతకుముందు, విమానం కూలిపోయి దగ్ధమవుతుండగా గాయపడిన రమేశ్ అంబులెన్సు వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేశ్‌ను అడగడం కనిపించింది. విమానం పేలిపోయింది అని గుజరాతీలో రమేశ్ చెప్పడం వినిపించింది.
11ఏ సీటు ప్రత్యేకతలు
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8(డ్రీమ్‌లైనర్స్)లో 11ఏ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్‌కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్‌కి వెనుక ఉంటుంది. క్యాబిన్‌కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11ఏ సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11ఏ సీటు ఎమర్జెన్సీ డోర్‌కు వెనుకనే ఉంటుంది.
Also Read..
PM Modi | విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ.. క్షతగాత్రులకు పరామర్శ
మృత్యుంజయుడు.. విమాన దుర్ఘటన నుంచి బయటపడ్డ లండన్‌వాసి.. 11ఏ సీటు ఎందుకు ప్రత్యేకం
Air India | ముంబై టు లండన్.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం