PM Modi | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్తు ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ మహా విషాదం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ విమాన ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
#WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College’s building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterday
PM Modi visited the plane crash site today to assess the ground situation.
(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz
— ANI (@ANI) June 13, 2025
అనంతరం అక్కడి నుంచి క్షతగాత్రులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి (Ahmedabad Civil Hospital)కి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స గురించి అక్కడి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ కూడా పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
Ahmedabad | PM Modi visited the AI-171 plane crash site and took stock of the situation pic.twitter.com/gFN3ezzvtQ
— ANI (@ANI) June 13, 2025
కాగా, ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్‌లో పెను విషాదం తనను ఎంతగానో కలచివేసిందని, మాటలు రావడం లేదని చెప్పారు. ఇది మాటలకందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించేనని తెలిపారు. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో టచ్‌లో ఉంటున్నట్టు చెప్పారు.
#WATCH | PM Modi visited the #AirIndiaCrash site and assessed the ground situation today.
(Video source: DD) pic.twitter.com/Mamim5HgBm
— ANI (@ANI) June 13, 2025
Also Read..
Air India | ముంబై టు లండన్.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
JetBlue | తప్పిన ఘోర విమాన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
Air India | విమానంలోని 241 మంది మృతిచెందారు.. ధృవీకరించిన ఎయిర్ఇండియా