JetBlue | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్ (Boston)లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Logan International Airport) రన్‌వేపై ఓ విమానం అదుపుతప్పింది. రన్‌వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
జెట్‌బ్లూ (JetBlue) సంస్థకు చెందిన 312 విమానం షికాగో నుంచి బోస్టన్లోని లోగాన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఒక్కసారిగా అదుపుతప్పింది. రన్‌వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు (passengers) ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జెట్‌బ్లూ సంస్థ స్పందించింది. విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లినట్లు పేర్కొంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా, గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
On the same day as a horrific international air disaster, it was a bit unnerving to skid off the runway while landing today in Boston. @JetBlue Flight 312
We deboarded on the tarmac and were bussed to the terminal where we actually made our connecting flight home. pic.twitter.com/ZbcDULwrDa— Todd LaVogue (he/him) (@ToddLaVogue) June 13, 2025
Also Read..
Air India | ముంబై టు లండన్.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
PM Modi | అహ్మదాబాద్‌కు మోదీ.. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న ప్రధాని
Air India | విమానంలోని 241 మంది మృతిచెందారు.. ధృవీకరించిన ఎయిర్ఇండియా