VijayDeverakonda | టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Virosh) వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, విజయ్-రష్మికలకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. విజయ్ దేవరకొండ షేర్ చేసిన పెళ్లి ఫోటోలను రీ-ట్వీట్ చేస్తూ నాని తనదైన శైలిలో స్పందించారు.
ఈ అందమైన జంటకు హృదయపూర్వక అభినందనలు. ప్రియమైన విజయ్, రష్మిక.. మీ ఇద్దరి జీవితం ఇకముందు మరింత అందంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అని నాని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సమంత, కీర్తి సురేష్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు కూడా ఈ జంటను ఆశీర్వదించారు.
Loads of love and congratulations to this beautiful couple. Wishing you an even more beautiful and blissful life together dear Vijay and Rashmika. ♥️
God bless. @TheDeverakonda @iamRashmika https://t.co/cX1nYvetA7— Nani (@NameisNani) February 26, 2026
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్‌లో ఈ వివాహాం జరిగింది. ఉదయం తెలంగాణ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకలు నిర్వహించారు. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.