మహబూబాబాద్ : నర్సింహులపేట(Narsimhulapeta) మండలంలో ఇసుకను అక్రమంగా (Illegal sand) రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇసుకకు అనుమతులు లేకుండా పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్ట వేసేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతామన్నారు.
అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. ప్రతి ఒక్కరు అనుమతులు తీసుకొని ఇసుకను కొనగోలు చేయాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbh | కుంభమేళా నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. హైదరాబాదీలు మృతి
VD12 | క్రేజీ న్యూస్.. విజయ్ దేవరకొండ వీడీ12 చిత్రానికి రణ్‌బీర్‌కపూర్ వాయిస్ ఓవర్..!