VD12 | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి వీడీ12 (VD12). జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. వీడీ 12 హిందీ టీజర్‌కు యానిమల్ హీరో రణ్‌బీర్‌కపూర్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. కథ ఇప్పుడు మరింత వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ విడుదల చేసిన తాజా వార్తతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు.
A story meant to be witnessed… now gets WILDER 💥💥
The Superstar #RanbirKapoor lends his voice to the #VD12 Teaser – one that will HAUNT YOU ❤️🔥
Feb 12th is going to be a feast for all 🔥 @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84… pic.twitter.com/2nsrlQMndV
— BA Raju’s Team (@baraju_SuperHit) February 11, 2025
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Akkineni Nagarjuna | నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాగచైతన్య తండేల్ సక్సెస్‌పై అక్కినేని నాగార్జున