Farmers | నర్సింహులపేట-ఫిబ్రవరి 13 : మాకు ఎకరం, రెండు ఎకరాల భూమి ఉంటే రైతు భరోసా పైసలు పడతలేవంటూ రైతులు ఇవాళ మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి వినయ్ కుమార్‌తోపాటు తహసీల్దార్ నాగరాజుతో వాగ్విదానికి దిగారు.
గత వారం రోజుల నుండి రైతు భరోసా పైసలు వేస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఉన్న దాంట్లో కోతలు విధిస్తూ కొద్ది మొత్తంలో మాత్రమే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న భూమి ప్రకారం రైతులందరికీ నగదు బ్యాంకు ఖాతాల్లో పడేదని, ఇప్పుడు సర్వే నెంబర్లు ఆధారంగా కోతలు విధిస్తూ రెండు ఎకరాలు ఉన్న రైతుకు రూ.3000 వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులతో అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని డబ్బులు పడేది మాకు తెలవదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోమంటూ చెప్పడంతో కొద్దిసేపు అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది.
Ground Water | అడుగంటిన జలాలు.. ఎండుతున్న పొలాలు.. రైతన్నకు తప్పని కన్నీళ్లు
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ