Kadiyam Srihari | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారని తెలిసిందే. నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు. నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపారని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కొండా సురేఖతో వివాదంపై కడియం శ్రీహరి స్పందించారు. కొండా సురేఖది అవగాహన లోపమన్నారు. అధికారులు నా దగ్గరికి వస్తే సమీక్ష అంటారు.. నేను అధికారుల దగ్గరికి వెళ్తే సమీక్ష అనరని కడియం స్పష్టం చేశారు. కొండా సురేఖకు ఆ మాత్రం అవగాహన కూడా లేదా..? అని ప్రశ్నించారు. నేను కేవలం నా నియోజకవర్గ ఆలయాల గురించి మాట్లాడేందుకు వెళ్లాను. అయినా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానన్నారు కడియం శ్రీహరి.
కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పక్కనపెట్టి ఇలాంటి పనికిరాని వాటి మీద టైమ్ వేస్ట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పర్మినెంట్ సూపరిండింటెంట్ లేడు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, ఇలాంటివి చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండని హితవు పలికారు.
కొండా సురేఖది అవగాహన లోపం
అధికారులు నా దగ్గరికి వస్తే సమీక్ష అంటారు నేను అధికారుల దగ్గరికి వెళ్తే సమీక్ష అనరు
ఆ మాత్రం అవగాహన కూడా లేదా?
నేను కేవలం నా నియోజకవర్గ ఆలయాల గురించి మాట్లాడేందుకు వెళ్ళాను
అయినా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి… https://t.co/A5U9phlLOA pic.twitter.com/R56yUfvSAY
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల్లో ఉండాలని చూస్తున్నారు
కొండా సురేఖతో వివాదంపై స్పందించిన కడియం శ్రీహరి
వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పక్కనపెట్టి ఇలాంటి పనికిరాని వాటి మీద టైమ్ వేస్ట్ చేస్తున్నారు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెర్మనెంట్… https://t.co/TcRNwNyBCV pic.twitter.com/IMLGLY63ou
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026