Supreme Court | ‘మీ సీఎం ఏం చేయాలో సుప్రీంకోర్టు చెప్పాలా’.. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకేపై సుప్రీంకోర్టు ఫైర్
Supreme Court | తమిళనాడు (Tamil Nadu) లో ప్రతిపక్ష పార్టీ డీఎంకే (DMK) పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టును వేదికగా మార్చవద్దని స్పష్టంచేసింది.
Supreme Court : తమిళనాడు (Tamil Nadu) లో ప్రతిపక్ష పార్టీ డీఎంకే (DMK) పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టును వేదికగా మార్చవద్దని స్పష్టంచేసింది. ఈ వ్యాఖ్యలతో డీఎంకే వెనక్కి తగ్గి తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి విజయ్ జూలై 10న అక్కడ పర్యటించనున్నారని డీఎంకే కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మృతుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు, ఆర్థిక సాయం అందించే కార్యక్రమం దర్యాప్తులో ఉన్న సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించింది. అంతేకాదు టీవీకే నేత ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రసంగాలు, పర్యటనలపై ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘ముఖ్యమంత్రి ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టే చెప్పాలా..? ఆయన ఈ కేసులో నిందితుడు కాదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుపైనా ఆంక్షలు కోరుతున్నారా..? రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలపై ఈ కోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుంది..?’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో డీఎంకే తన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది.
కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో విజయ్ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తొక్కిసలాటకు టీవీకే కార్యకర్తల నిర్లక్ష్యమే కారణమని డీఎంకే ఆరోపిస్తుండగా, ఇదంతా డీఎంకే రాజకీయ కుట్రేనని విజయ్, టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

