Congress | జూపల్లి VS సీఎం రేవంత్ .. మంత్రి కూరలో కరివేపాకు అంటూ మీడియాలో కథనాలు
Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి.
Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి. సీఎం ఏక పక్ష నిర్ణయాలతో మంత్రులు కుతకుత ఉడికిపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వివాదాలు ముదిరి పాకానపడ్డాయి. సంబంధిత మంత్రి జూపల్లి లేకుండానే పర్యాటక శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. తనకు చెప్పకుండా సొంత శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయడంపై జూపల్లి సీరియస్ అయ్యారు.
వెంటనే అధికారులకు ఫోన్ చేసి రేవంత్ సమీక్షపై వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జూపల్లి ‘కూరలో కరివేపాకు’ అంటూ రేవంత్ రెడ్డి మీడియా బిగ్ టీవీలో కథనాలు రావడం కలకలం రేపింది. జూపల్లిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వెనుక అప్పులపై కాంగ్రెస్ ‘సెల్ఫ్ గోల్’ ఎపిసోడ్ కారణమని తెలిసింది. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్తో సవాల్ చేసి పారిపోవడంతో జూపల్లిపై రేవంత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు తమ శాఖలపై రేవంత్ పెత్తనం చేయడంపై పలువురు మంత్రుల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న వైనంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దేవాదాయ శాఖ మంత్రిని సంప్రదించకుండా యాదాద్రి ట్రస్టు బోర్డు నియామకం చేపట్టడం, సినిమాటోగ్రఫీ మంత్రికి చెప్పకుండా సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వడం ఇలా అనేక విషయాల్లో తలదూర్చడంతో ఆగ్రహంగా ఉన్న మంత్రులు అదును చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి.
జూపల్లి VS రేవంత్
ముదిరిన వివాదం.. జూపల్లి లేకుండానే పర్యాటక శాఖ సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి
తనకు చెప్పకుండా సొంత శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయడంపై జూపల్లి సీరియస్
వెంటనే అధికారులకు ఫోన్ చేసి రేవంత్ సమీక్షపై వివరాలు తెలుసుకున్న జూపల్లి
జూపల్లి ” కూరలో కరివేపాకు ” అంటూ… https://t.co/dLlIJCObdG pic.twitter.com/64rYuJeiFB
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

