Protest | మేం ఇంజినీరంగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలా.. పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా..!
Protest | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు (Politechnic Students) ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా మూడేళ్ల చదువు వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలా..? అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు.
Protest : తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు (Politechnic Students) ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా మూడేళ్ల చదువు వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలా..? అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు. యంగ్ ఇండియా (Young India) స్కిల్ యూనివర్సిటీ (Skill University) పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడంవల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు అంటున్నారు.
జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని వికారాబాద్ పట్టణంలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ స్కీమ్ వల్ల సాంకేతిక విద్యా మండలి (SBTET) స్వతంత్రత దెబ్బతింటుందని, డిప్లొమాను సాధారణ శ్రామిక శిక్షణగా మారుస్తున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ఈ GO ను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అసలు ఎవరిని అడిగి ఈ స్కీమ్ తెచ్చారు రేవంత్ రెడ్డి గారు..? అని విద్యార్థులు నిలదీస్తున్నారు.
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది
ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ,… https://t.co/iWxbm40JuF pic.twitter.com/uIH06sZjLY
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

