(Gandra Coments) జయశంకర్ భూపాలపల్లి: బీజేపీ వ్యాపార వర్గాలకు కొమ్ము కాసే పార్టీ అని, అలాంటి పార్టీకి రైతుల ప్రయోజనాలు ఎలా పడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం
క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మళ్ళీ వస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ఎఫ్సీఐని ఎత్తి వేసేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు. రైతుల ఊసురు పోసుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
మీడియా ముసుగులో బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న అసలు స్వరూపం బయట పడిందని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. తీన్మార్ మల్లన్న తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరోన కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని, ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరారు. జిల్లాలో 100 పడకల దవాఖాన ఏర్పాటు, సిబ్బంది నియామకానికి, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. నెలలోనే ఇది ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..