Sarpanch Elections | ఆ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని విజయం సాధించాడని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం వారిని కౌంటింగ్ హాల్ నుంచి కూడా పంపించారు. ఆ తర్వాత 5 నిమిషాలు కరెంట్ పోయింది.. కట్ చేస్తే.. అధికారుల ప్రోద్భలంతో రీకౌంటింగ్.. 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. అవును.. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నీలిబండ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెలుగు చూసింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అవకతవకలు జరిగాయని ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించాయి.
వివరాల్లోకి వెళ్తే.. నీలిబండ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 714 ఓట్లు పోలవ్వగా.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి 45 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి మొదట 378 ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 333 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించిన అధికారులు వారిని కౌంటింగ్ హాల్ నుంచి పంపించేశారు.
ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేయించి మరి..
ఆ తర్వాత 5 నిమిషాలు కరెంట్ కట్ అయింది.. ఇంతలో రీకౌంటింగ్‌కు అప్పీల్ చేయమని ఎన్నికల అధికారులు కాంగ్రెస్ అభ్యర్థిని కోరారు. ఈ క్రమంలో రీకౌంటింగ్ చేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 5 ఓట్ల తేడాతో గెలుపొందినట్టు ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత ఓట్ల ఫలితాలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 353 రాగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 358 వచ్చాయి.
45 మెజారిటీ వచ్చిన తర్వాత 5 ఓట్ల తేడాతో ఓడిపోవడం.. ఎన్నికల అధికారులు పనిగట్టుకుని రీకౌంటింగ్‌కు కోరడంతో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారంతా ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. మొదట బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలవగా.. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేయించి మరి ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేం గెలిచిన అరగంట తర్వాత ఆర్వో కల్పించుకుని మరి ఇలా చేశారు. రీకౌంటింగ్ అనేది అభ్యర్థి కోరుకోవాలి. ఆర్వోకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలవగా.. రీకౌంటింగ్ చేయించి ఓడించిన ఎన్నికల అధికారులు
జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నీలిబండ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 714 ఓట్లు పోలవ్వగా.. 45 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి
మొదట పోలైన ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి… pic.twitter.com/ExAvkwUBx5
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2025
Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!