Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ హిట్ తర్వాత అదే రేంజ్‌కు తగ్గట్టు తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేశాడు. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కుతోంది. హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో, ఇప్పుడు గురూజీ డైరెక్టర్‌గా వెంకీని తెరకెక్కించడంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా, మొదటగా 2026 సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, సమ్మర్ కన్నా 2026 సెకండ్ హాఫ్‌లో వచ్చే దసరా ఫెస్టివల్ సీజన్‌కు రిలీజ్ చేయడం బెటర్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దసరా పండుగ టైమ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో, ‘ఆదర్శ కుటుంబం’కు అది పర్ఫెక్ట్ స్లాట్ అని భావిస్తున్నారట. అందుకే రిలీజ్ ప్లానింగ్‌లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక 2026 సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా కూడా రిలీజ్ ప్లానింగ్‌లో ఉంది. జనవరిలో ‘రాజా సాబ్’తో ప్రభాస్ రాబోతుండటంతో, ‘ఫౌజీ’ని ఆగస్టు లేదా డిసెంబర్‌కు షిఫ్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ సినిమా దసరాకు వస్తే బాక్సాఫీస్‌కు సేఫ్ ఆప్షన్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ‘హిట్ 3’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలతో ఇప్పటికే తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న శ్రీనిధికి, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం మరింత క్రేజ్ తీసుకొచ్చే అవకాశంగా మారింది. ‘ఆదర్శ కుటుంబం’ పూర్తయ్యాక వెంకటేష్ నెక్స్ట్ ఒక యువ హీరోతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఈ సినిమాను ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటే పెద్ద సూపర్ హిట్‌గా నిలపాలని గట్టిగా కృషి చేస్తున్నారని టాక్. ఇక గురూజీ ఈ ప్రాజెక్ట్ తర్వాత తాను ప్లాన్ చేస్తున్న మైథాలజీ సబ్జెక్ట్‌పై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నప్పటికీ, ఎన్టీఆర్‌తో చేయాల్సిన మైథాలజీ మూవీ ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్‌తో సినిమా పూర్తి చేయాల్సి ఉండగా, కొరటాల శివతో ‘దేవర 2’పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్–ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.