యాదాద్రి భువనగిరి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డికి సర్పంచ్ల నుంచి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ సర్పంచ్ గ్రామాలకే నిధులు ఇస్తూ.. త మకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఆందోళన చేశారు. గురువారం భువనగిరి పట్టణ పరిధిలో ప్రజాపాలన- 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతుండగా సర్పంచ్‌లు అడ్డుకునే య త్నం చేశారు. వేదిక వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళా భవనాలు, సీసీ రోడ్ల మంజూరులో చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అయ్యా రు. బీఆర్ఎస్ సర్పంచ్‌లపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, సర్పంచ్‌లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు కమిటీ ఏర్పాటుపై మంత్రి పొన్నం ప్రభా కర్తో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సమావేశమయ్యారు. గురువారం పొన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయిన వారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలు, అర్హుల ఎంపిక అంశాలను మంత్రికి వివరించారు.