Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!
Spirit | దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘స్పిరిట్’ (Spirit Movie) షూటింగ్ షెడ్యూల్లో తాజాగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో నవంబర్ నెలలో వచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ చివరి వరకూ షూటింగ్ చేసి న్యూ ఇయర్‌కు బ్రేక్ ఇవ్వాలని వంగా భావించారు.
Spirit | దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘స్పిరిట్’ (Spirit Movie) షూటింగ్ షెడ్యూల్లో తాజాగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో నవంబర్ నెలలో వచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ చివరి వరకూ షూటింగ్ చేసి న్యూ ఇయర్‌కు బ్రేక్ ఇవ్వాలని వంగా భావించారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.లేటెస్ట్ సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ను డిసెంబర్ 2027కి కాకుండా 2027 మధ్యలోనే రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అదే కారణంగా న్యూ ఇయర్ బ్రేక్‌ను రద్దు చేసి, షూటింగ్‌ను నిరంతరంగా కొనసాగించాలని టీమ్ డిసైడ్ అయ్యిందట. దీంతో న్యూ ఇయర్ సమయంలో కూడా ‘స్పిరిట్’ టీమ్ సెట్స్‌పైనే పని చేయనుంది.
ఈ సినిమా షూటింగ్ నవంబర్ 27న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్ జనవరి మొదటి వారం వరకూ కొనసాగనుంది అని సమాచారం. ఆ తర్వాత కేవలం కొద్ది రోజుల విరామం మాత్రమే తీసుకుని, వెంటనే తదుపరి షెడ్యూల్ మొదలుపెట్టే అవకాశముందని చిత్రబృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి.“ఈసారి న్యూ ఇయర్ బ్రేక్ లేదు” అనే స్పష్టమైన ఆదేశాలు వంగా టీమ్‌కు ఇచ్చినట్టుగా టాక్. ‘స్పిరిట్’ సందీప్ రెడ్డి వంగాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్. ముఖ్యంగా ఇది ప్రభాస్‌తో ఆయన చేస్తున్న తొలి సినిమా కావడం విశేషం. అలాగే, ఈ చిత్రంతోనే వంగా – వివేక్ ఒబెరాయ్ కాంబినేషన్ కూడా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. యాక్షన్‌తో పాటు బలమైన డ్రామా ఈ చిత్రానికి ప్రధాన బలం అని సమాచారం.
ఇక విలన్ పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ కోసం కూడా వంగా ఓ ప్రత్యేకమైన లుక్‌ను డిజైన్ చేసినట్టు టాక్. గతంలో ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్‌ను పూర్తిగా కొత్తగా చూపించిన విధంగానే, ‘స్పిరిట్’లో కూడా వివేక్ ఒబెరాయ్‌ను ఊహించని అవతారంలో చూపించబోతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆయన పాత్ర సినిమా మొత్తానికి కీలకంగా ఉండడమే కాకుండా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండనుందని సమాచారం. మొత్తానికి, ‘స్పిరిట్’ను అనుకున్నదానికంటే త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే వంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంగా స్టైల్ రా యాక్షన్‌కు ప్రభాస్ పవర్ కలిసి, ‘స్పిరిట్’ ఒక స్పెషల్ మూవీగా నిలవనుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

