Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
Superstar Rajinikanth | కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబంతో సమయం గడపడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు.
Superstar Rajinikanth | కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబంతో సమయం గడపడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్ దేశంలో సరదాగా గడుపుతున్న అద్భుతమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తలైవా చిన్న కుమార్తె, ప్రముఖ నిర్మాత సౌందర్య రజనీకాంత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఈ ఫ్యామిలీ వెకేషన్ పిక్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగర వీధుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తన సతీమణి లతా రజనీకాంత్, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మనవళ్లతో కలిసి ఉత్సాహంగా నడుస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ఈ ఫోటోల్లో కనువిందు చేస్తున్నాయి. “ఏథెన్స్లో మేము ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకున్నాం! ఈ అందమైన ఫ్యామిలీ గెట్అవేలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం” అంటూ సౌందర్య క్యాప్షన్ జోడించారు. క్యాజువల్ లుక్‌లో ఎంతో రిలాక్స్డ్గా, చిరునవ్వుతో కనిపిస్తున్న తలైవాను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇటీవల గ్రీస్ వేదికగా జరిగిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ కుటుంబం, ఆ తర్వాత ఇలా తీరిక సమయం చేసుకుని ఏథెన్స్ అందాలను ఆస్వాదిస్తూ విలువైన జ్ఞాపకాలను సొంతం చేసుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

