KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది : కేటీఆర్
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిడ్డారు.
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిడ్డారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నించారు. ఏపీ జలదోపిడిని అడ్డుకోడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా కేఆర్ఎంబీ దగ్గర ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందా? తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీళ్లను తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని, ఏపీ నీటి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని మన ప్రభుత్వం ఏమైనా కేఆర్ఎంబీకి ఉత్తరం రాసిందా? అని నిలదీశారు.
హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కోసం కృష్ణా నదిలో డ్రింకింగ్ వాటర్ కోసం ఎలాంటి నిల్వలను కేటాయించారో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ వద్ద ఏపీ నీటి తరలింపుల మీద ఏమైనా నిరసన తెలిపారా? మీరు ఇష్టానుసారంగా నీళ్ల దోపిడీకి పాల్పడితే బీఆర్ఎస్ ఊరుకోదు.. అవసరమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ జలదోపిడీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగ సభలు పెట్టి కృష్ణా నది పరివాహక ప్రజలను చైతన్యవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడి చేస్తుంది
కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
ఈ జలదోపిడిని అడ్డుకునేందుకు న్యాయ పోరాటాలు చేస్తాం, బహిరంగ సభలు పెట్టి కృష్ణా నది పరివాహక ప్రజలను చైతన్యవంతం చేస్తాం
– కేటీఆర్ https://t.co/8OuUujYf3t
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
ఏపీ జలదోపిడిని అడ్డుకోడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా KRMB దగ్గర ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందా?
తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీళ్లను తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని, ఏపీ నీటి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని మన ప్రభుత్వం ఏమైనా KRMBకి ఉత్తరం రాసిందా?
హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కోసం కృష్ణా నదిలో డ్రింకింగ్ వాటర్ కోసం ఎలాంటి నిల్వలను కేటాయించారో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
KRMB వద్ద ఏపీ నీటి తరలింపుల మీద ఏమైనా నిరసన తెలిపారా?
మీరు ఇష్టానుసారంగా నీళ్ల దోపిడీకి పాల్పడితే బీఆర్ఎస్ ఊరుకోదు.. అవసరమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాము
– కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది : కేటీఆర్
Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

