IKP Centres | బచ్చన్నపేట, ఏప్రిల్ 21 : జనగామ జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బచ్చన్నపేట మండలంలోని చిన్న రామంచర్ల బచ్చన్నపేట ఐకేపీ కేంద్రాలను సీపీఎం పార్టీ బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ.. వరి కోతలు సుమారు 15 రోజుల క్రితం నుండి కోతలు కోసి ఐకేపీ కేంద్రాల్లో వడ్లను పోసి రైతులు 15 రోజులు గడిచిన వడ్లను ప్రభుత్వం కొనకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఐకేపీ కేంద్రాలలో ఎండలు బాగా ముదిరిన సందర్భంగా రైతులకు, హమాలీలకు టెంట్లను ఏర్పాటు చేయాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పార్టీ మండల కమిటీ సభ్యులు అన్నే బోయిన రాజు, బుర్రి సుధాకర్, రామగళ్ళ అశోక్, గుడికందుల నాగరాజు, బాల నరసయ్య, కనకయ్య, కర్రే రాములు, తదితరులు పాల్గొన్నారు.
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు