Dhanush | రాజకీయాల్లోకి ధనుష్ .. అభిమానులకు ఇచ్చిన పిలుపుతో మొదలైన కొత్త చర్చ!
Dhanush | తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. అభిమానులు కేవలం సినిమా వేడుకలు, ఫ్యాన్ షోలు, ఆడియో లాంచ్‌లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి
Dhanush | తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. అభిమానులు కేవలం సినిమా వేడుకలు, ఫ్యాన్ షోలు, ఆడియో లాంచ్‌లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ధనుష్ కూడా త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం తమిళనాట ఊపందుకుంది. రీసెంట్గా నిర్వహించిన ఓ బహిరంగ కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ధనుష్, తమ ఐక్యతను మంచి పనుల కోసం ఉపయోగించాలని సూచించారు.
ఇంతమంది ఒకే వేదికపై కలవడం అంటే దాని వెనుక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తికి సరైన దిశను ఇవ్వాలి. కేవలం ఆడియో లాంచ్‌లు, ఫ్యాన్ మీట్లకే పరిమితం కాకుండా, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ ప్రాంతంలో అవసరమైన వారికి మీకు చేతనైన సహాయం చేయండి. మీ పనులు చూసి నేను మరింత గర్వపడేలా చేయండి. మీరు తప్పకుండా అది సాధిస్తారని నాకు నమ్మకం ఉంది అని ధనుష్ అన్నారు. ధనుష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో, ఇప్పుడు ధనుష్ కూడా అదే దారిలో నడవబోతున్నారంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది అభిమానులు ధనుష్ చేసిన వ్యాఖ్యలను భవిష్యత్ రాజకీయ ప్రణాళికలకు సంకేతంగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం సమాజ సేవపై అవగాహన కల్పించేందుకే ఆయన ఈ పిలుపునిచ్చారని అభిప్రాయపడుతున్నారు. అయితే ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలపై ఇప్పటివరకు ఆయన గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అభిమానుల ఊహాగానాలకే పరిమితమయ్యాయి.ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్, అభిమానులను సమాజ సేవ వైపు ప్రోత్సహించిన తీరు మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆయన రాజకీయ అరంగేట్రంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

