Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Hot Adilabad | ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉన్నది. ఆదిలాబాద్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ 'ఎల్డోరాడో వెదర్' తాజాగా ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది.
Hot Adilabad : ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా అయితే ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ తాజాగా ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది.
సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్డోరాడో వెదర్ జాబితాలో మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే.. కొత్తగూడెం, గద్వాలలో 43.3, నిర్మల్, నిజామాబాద్‌లలో 43.0 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ప్రాంతంలో ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి భౌగోళిక కారణాలతోపాటు అటవీ విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణమని వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
మహారాష్ట్రలోని విదర్భ సరిహద్దులో ఉండటంవల్ల మధ్య భారతం నుంచి వీచే పొడి, వేడి గాలులు ఇక్కడ ఉష్ణోగ్రతలను అమాంతం పెంచుతున్నాయి. దీనికి తోడు 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్లే సహజసిద్ధమైన చల్లదనం లోపించి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు కూడా గ్లోబల్ హీట్ లిస్టులో చేరుతున్నాయి. మూసీ నది పరీవాహక ప్రాంతం కావడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, భూగర్భ జలాలు పడిపోవడంవల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ట్రాప్ అవుతోంది. నగరంలోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. ముషీరాబాద్‌లో 41.6, అంబర్‌పేటలో 41.4, మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో 41.3, మెహదీపట్నంలో 41.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

