Jailer 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ గురించి తాజాగా కీలక అప్డేట్ వెలువడింది. చిత్ర బృందం అధికారికంగా షూటింగ్ పూర్తయిందని ప్రకటించడంతో, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తే, సినిమా అనుకున్న సమయానికి ముందే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. దీంతో అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, ఎస్.జే. సూర్య, మోహన్‌లాల్, రమ్య కృష్ణన్, మీర్నా మీనన్, యోగి బాబు వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తవడంతో, ఇప్పుడు అందరి దృష్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు రిలీజ్ డేట్‌పై ఉంది. రజనీకాంత్ స్టైల్, నెల్సన్ మార్క్ ఎంటర్టైన్మెంట్ కలయికలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Alapparai Kelappurom, Thalaivaru Nerandharam! ⭐💥 It’s a wrap for #Jailer2 😎@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/75kLIQBF4w
— Sun Pictures (@sunpictures) April 21, 2026