KTR | ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా.. ల్యాప్ టాప్ అందించి.. కాలేజీ ఫీజు సైతం చెల్లిస్తానని హామీ
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుచేసుకున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. కాలేజీ ఫీజును కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
KTR | రాజన్న సిరిసిల్ల, జూలై 27( నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుచేసుకున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. కాలేజీ ఫీజును కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన అభినవ్‌ను కేటీఆర్ శాలువాతో సత్కరించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ల్యాప్‌టాప్ అందజేశారు. అంతేకాకుండా అభినవ్ కాలేజీ ఫీజును కూడా తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు.
కేవలం చదువు మీద దృష్టి పెట్టి.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినవ్‌కు కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు అభినవ్, అతని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువబోమని, కేటీఆర్‌కు రుణపడి ఉంటామని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

