Bihar Jamui Harassment | బీహార్‌లో కీచక పర్వం.. నడిరోడ్డులో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు
Bihar Jamui Harassment | బీజేపీ పాలిత బీహార్‌లో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. నడిరోడ్డుపై ఓ బాలికను అల్లరి మూక లైంగికంగా వేధించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Bihar Jamui Harassment | జముయి : బీజేపీ పాలిత బీహార్‌లో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. నడిరోడ్డుపై ఓ బాలికను అల్లరి మూక లైంగికంగా వేధించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జముయిలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, ఆమె స్నేహితుడు శనివారం సాయంత్రం కోచింగ్ క్లాస్ ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న సమయంలో జముయి- లఖిసరాయ్ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కొందరు వ్యక్తులు వీరిద్దరినీ చుట్టుముట్టినట్లు కనిపించింది. బాలికను వెంబడించి అడ్డుకోవడం, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.
బాలిక స్నేహితుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా, నిందితులు వారిని వెంటాడినట్లు వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలో జముయి ఎస్పీ విశ్వజిత్ దయాల్ కేసు దర్యాప్తును ప్రారంభించి, వీడియోలోని దృశ్యాల ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బాలికపై వేధింపులకు పాల్పడినవారిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో రహదారిపై బాలికకు రక్షణ లేకపోవడంపై ఆయన బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనను ఖండించిన బీహార్ మంత్రి సునీల్ కుమార్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
This is the full video of Jamui, Bihar incident.
See the boy in white shirt. That boy didn’t run. He didn’t freeze. He stayed with her when a group of men surrounded them on a dark road. Presence of mind and raw courage in a moment most people would collapse. He helped get both… https://t.co/Jh768oR7oX pic.twitter.com/ChYe0whZ1v
— Omkar Rathore (@omiverseglobal) September 21, 2026
ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి!
జముయి ఘటనపై బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ స్పందిస్తూ ‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ‘ప్రపంచంలో పూర్తిగా నేరాలు అంతరించిపోలేదని, ఇలాంటి ఘటనలు అడపాదడపా జరుగుతుంటాయని’ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం నిఘా ఉంచుతున్నదని, నేరాలకు పాల్పడినవారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.
🚨
దశాబ్దాల కాలంగా బీజేపీ పాలనలో ఉన్న బీహార్ అమ్మాయిల రక్షణ..
ఏవిదంగా ఉందో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది..#WomenSafety #Bihar pic.twitter.com/lz0Q29EMNP
— UttarandhraNow (@UttarandhraNow) September 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

