Inter Exams | హనుమకొండ చౌరస్తా, మార్చి 3 : మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు 5 నుంచి ప్రారంభమై 24తో ముగియనున్నాయి. మార్చి 6 నుంచి మొదలయ్యే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 25వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా..
పరీక్షల నేపథ్యంలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 39980 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 18397 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 19480 మొత్తం 37877 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వొకేషనల్ మొదటిసంవత్సరం విద్యార్థులు 1146, రెండో సంవత్సరం విద్యార్థులు 857.. మొత్తం వొకేషనల్ విద్యార్థులు 2103 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 55 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
55 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 55 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 42 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్, ఏడుగురు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. నలుగురు సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షణ ఉండనుంది. 9 మంది కస్టోడియాన్ని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ ఎగ్జామినేషన్ కమిటీ(డీఈసీ) ,ఇద్దరు సీనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్, ఒక సీనియర్ లెక్చరర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి జి. గోపాల్ తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని.. కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ నుంచి ఉండగా హనుమకొండ డీఐఈవో కార్యాలయం నుంచి కంట్రోల్ రూం పనిచేస్తుందని ఆయన వివరించారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు