Maoists | కొత్తగూడెం, ప్రగతి మైదాన్ : మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తికి గురైన 14 మంది సభ్యులు జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారుల ఎదుట చత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 14 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయారన్నారు.
ఆర్పీసీ మిలీషియా కమాండర్ మడివి భీమ, ఇద్దరు ఆర్పీసీ సీఎన్ఎం అధ్యక్షులు సోడి ఉంగ, మడివి అడుమ, ఆర్పీసీ డిఏకేఎం సభ్యుడు కుంజాం కోసా, సీఎన్ఎం కమాండర్ కోవాసి నందా అలియాస్ శ్రీను, ఆర్ పి సీఎన్ఎం సభ్యుడు మడివి భీమ, సీఎన్ఎం సభ్యుడు మడివి మాసా, టైలరింగ్ టీం కమాండర్ కుంజం లక్మా, ఆర్పీసీ సీఎన్ఎం సభ్యురాలు వెట్టి లక్కే, ఆర్పీసీ మిలీషియా క్యాడర్ మడివి చుక్కయ్య, ఆర్పీసీ సీఎన్ఎం సభ్యుడు వెట్టి కోసా, ఆర్పీసీ సీఎన్ఎం సభ్యుడు మడివి భీమ, ఆర్పీసీ మిలీషియా సభ్యురాలు సోడి రాధిక, ఆర్పీసీ సీఎన్ఎం సభ్యురాలు కుహ్రామి కాజల్ అలియాస్ పాలె లొంగిపోయిన వారిలో ఉన్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
తమకు మనుగడ ఉండదని..
గత కొంతకాలంగా నిషేధిత మావోయిస్టు పార్టీ ఆదివాసి ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి, కాలం చెల్లిన సిద్ధాంతాలతోపాటుగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని, అడ్డుకుంటూ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయక ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయాలను గ్రహించిన సదరు 14 మంది సభ్యులు అసంతృప్తికి లోనై స్వేచ్ఛాయుత జీవనాన్ని గడిపేందుకు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు.
ఈ విలేకరుల సమావేశంలో ఓఎస్డీ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, చర్ల సీఐ ఆలెం రాజు వర్మ, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Posani Krishna Murali | పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట జైలుకు తరలింపు
Mazaka Movie | 36 రోజుల్లో ‘మజాకా’ సినిమాని కంప్లీట్ చేశాం : సందీప్ కిషన్