Mazaka Movie | నటుడు సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన తాజా చిత్రం మజాకా(Mazaka). ఈ సినిమాకు త్రినాధరావు నక్కినా దర్శకత్వం వహించగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ 36 రోజుల్లోనే కంప్లీట్ చేసినట్లు తెలిపాడు.
మజాకా సినిమాను డిసెంబర్ 26న మొదలుపెడితే ఫిబ్రవరి 26న కంప్లీట్ చేసి రిలీజ్ చేశాం. కేవలం 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ని కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు, ప్రమోషన్స్ పూర్తి చేసుకుని సినిమా ముందుకు వచ్చింది. రెండు నెలల్లో ఒక నటుడికి అయిన, డైరెక్టర్ డిపార్ట్మెంట్కి అయిన, ప్రోడక్షన్ టీమ్‌కి అయిన ఇది చాలా పెద్ద టాస్క్. సంక్రాంతి వచ్చిన మాకు పండుగ కూడా లేదు. అర్థరాత్రి వరకు షూట్ చేసి మళ్లీ.. ఉదయం 4 గంటలకే షూటింగ్‌కి వచ్చే వాళ్లం. అంతా కష్టపడ్డాం ఈ సినిమాకి అంటూ సందీప్ కిషన్ చెప్పుకోచ్చాడు.
ఇక మజాకా సినిమా కథ విషయానికి వస్తే.. వెంకటరమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు వుండదు. ఎలాగైనా ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటోని చూసుకోవాలనేది వారి తపన. కృష్ణకి పెళ్లి చూపులు చూస్తుంటాడు తండ్రి. అయితే ఆడదిక్కు లేని ఇంట్లోకి ఎవ్వరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలూ తీరుతాయని ఒకరు సలహా ఇస్తారు. ఇదే సమయంలో వెంటకరమణకి యశోద (అన్షు) పరిచయం అవుతుంది. మరోపక్క కృష్ణ కూడా మీరా (రీతూవర్మ) ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది. వీళ్ల ప్రేమకథల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంట్లో ఫ్యామిలీ ఫోటో చూసుకోవాలనే వారి కోరిక తీరిందా ? ఇదంతా తెరపై చూడాలి.