Pradeep Ranganathan | యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ కోలీవుడ్ నటుడు లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్‌ను షేర్ చేశాడని తెలిసిందే. చెప్పుకునేంత పర్సనాలిటీ, ఇంప్రెసివ్ లుక్స్ ఏం లేకపోయినా లవ్ టుడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇండస్ట్రీలోకి వద్దామనుకున్న వారికి అవేవి అడ్డుకాదని.. టాలెంట్ ఉంటే చాలని నిరూపించాడు.
అయితే ఈ కుర్ర హీరోతో గతంలో పనిచేయడానికి ఇష్టపడని హీరోయిన్లు ఇప్పుడు మాత్రం ఆలోచన మార్చేసుకున్నారన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇటీవలే డ్రాగన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ప్రదీప్ రంగనాథన్‌తో సినిమా చేసేందుకు సై అంటున్నారు. డ్రాగన్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. డైరెక్షన్ ప్రదీప్ మొదటి ప్రాధాన్యత అయినప్పటికీ.. తాజా సక్సెస్‌లతో ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టాల్సి వస్తుందట.
ఇవానా తో జర్నీ మొదలు అనుపమ పరమేశ్వరన్తో కలిసి నటించడంతో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ఎలా పెరుగుతుందో అర్థమవుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇప్పటికే ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక డ్రాగన్‌లో కడయు లోహర్, అనుపమ పరమేశ్వరన్తో రొమాన్స్ చేశాడు.
డ్రాగన్‌ను తెలుగులో రిలీజ్ చేసిన టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. ప్రదీప్ రంగనాథన్‌తో డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్తో ఓ సినిమా చేయబోతుంది. తాజా కథనాల ప్రకారం ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందట. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే అగ్రభాగం పూర్తయినట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. మొత్తానికి క్రేజీ హీరోయిన్లను లైన్లో పెట్టి హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్.