KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సూచనతో అధికారులు కదిలారు.
సిరిసిల్ల రూరల్, మార్చి 3: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సూచనతో అధికారులు కదిలారు. నిన్న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్‌ను రంగనాయక సాగర్ నుంచి నీళ్లు ఇప్పించాలని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల, నేరెళ్ల, చిన్న లింగాపూర్, రామచంద్రపురం, దాచారం రైతులు కోరిన విషయం తెలిసిందే. స్పందించిన కేటీఆర్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి నీళ్లు అందివ్వాలని సూచించారు. దీంతో సోమవారం జక్కాపూర్‌లోని రంగనాయక సాగర్ కాల్వను ఎస్ఈ రవీందర్, అధికారులు తంగళ్లపల్లి మండలంలో రైతులుతో కలిసి సందర్శించారు. కాలువను పరిశీలించి నీటి సరఫరా చేస్తామని, నీటి ఫ్లో కూడా పెంచుతామని పేర్కొన్నారు.
రంగనాయక సాగర్ కాల్వ నుంచి జిల్లెళ్ల వరకు నీటి సరఫరా చేస్తామని, కాలువలో భూములు కోల్పోయిన రైతులకు, పెండింగ్‌లో ఉన్న భూ పరిహారం రూ.55 లక్షలు రైతులకు త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రంగనాయక సార్ కాలువ ద్వారా అందరికీ సమానంగా నీటి సరఫరా చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు తంగళ్లపల్లి మండలంలోని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో మాజీ సర్పంచ్ మాట్ల మధు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఏనుగు రాజేశ్వరరావు, రైతులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

