Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
Kerala Man Shot Dead | భారత్‌కు చెందిన వ్యక్తి జోర్డాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. గమనించిన జోర్డాన్ సైనికులు అతడ్ని కాల్చి చంపారు. మృతుడ్ని కేరళకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ పెరెరాగా గుర్తించారు.
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన వ్యక్తి జోర్డాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. గమనించిన జోర్డాన్ సైనికులు అతడ్ని కాల్చి చంపారు. (Kerala Man Shot Dead) మృతుడ్ని కేరళలోని తుంబాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ పెరెరాగా గుర్తించారు. అతడి బంధువు ఎడిసన్ కాల్పుల్లో గాయపడినప్పటికీ ప్రాణాలు దక్కించుకున్నాడు. చికిత్స తర్వాత అతడ్ని భారత్‌కు పంపారు. ఫిబ్రవరి 10న ఈ సంఘటన జరిగినట్లు జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ‘దురదృష్టవశాత్తూ భారత జాతీయుడు మరణించిన విషయం తెలిసింది. మృతుడి కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు జోర్డాన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.
కాగా, థామస్ గాబ్రియేల్ పెరెరా ఐదేళ్లపాటు కువైట్‌లో పని చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 5న కేరళ నుంచి విజిట్ వీసాపై జోర్డాన్ వెళ్లినట్లు చెప్పారు. అయితే ఫిబ్రవరి 9న పెరెరా తన భార్యకు చివరిసారి ఫోన్ చేశాడని, తన కోసం ప్రార్థించమని చెప్పి కాల్ కట్ చేసినట్లు కుటుంబ సభ్యుడు తెలిపాడు. ఆ తర్వాత జోర్డాన్ సైనికుల కాల్పుల్లో మరణించినట్లుగా తమకు సమాచారం అందిందని చెప్పాడు.
The Embassy has learnt of the sad demise of an Indian national in unfortunate circumstances. The Embassy is in touch with the family of the deceased and is working closely with Jordanian authorities for transportation of mortal remains of the deceased. @MEAIndia
— India in Jordan (@IndiainJordan) March 2, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Israel
- jordan
- Kerala Man
- Shot dead
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

