ఖిలా వరంగల్ : గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ లోని ఖిలా వరంగల్ మధ్యకోటలో శుక్రవారం కార్పొరేటర్ భైరబోయిన ఉమ సీసీ రోడ్డు( CC roads), డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. బల్దియా సాధారణ నిధులు రూ.30 లక్షలతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. డివిజన్లోని రజక, ముస్లిం మైనారిటీ, పద్మశాలి, మున్నూరు కాపు వాడలలో రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తి చేశామన్నారు. కొత్తగా వెలిసిన కాలనీలకు కూడా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానికంగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ యాదవ్, నాయకులు పోశాల సారంగపాణి, బైరబోయిన రవీందర్, మంద అరుణ, గుండు లక్ష్మీనారాయణ, కండ్రాతి రమేష్, బైరబోయిన శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
RTC Conductor | మద్యం మత్తులో మహిళ కండక్టర్‌తో.. అసభ్య ప్రవర్తన..
TGGENCO | చేతులెత్తేసిన జెన్కో.. ప్రైవేట్‌కు బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్
CLP Meeting | ష్.. సుప్రీంకోర్టు చూస్తున్నది.. పారిపో!!