హోలీ వేడుకల్లో విషాదం
హోలీ వేడుకల్లో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగిన ఇద్దరు మిత్రులు గల్లంతయ్యారు. ఈ ఘటన మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని సింగరేణి పార్కు సమీపంలో హోలీ వేడుకలు జరుపుకున్న సుమారు 15 మందికి పైగా యువకులు గోదావరి నది వద్దకు వెళ్లి స్నానాలు పూర్తి చేసుకున్నారు.
- గోదావరిలో ఇద్దరు మిత్రుల గల్లంతు
- గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
మణుగూరు టౌన్, మార్చి 3: హోలీ వేడుకల్లో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగిన ఇద్దరు మిత్రులు గల్లంతయ్యారు. ఈ ఘటన మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని సింగరేణి పార్కు సమీపంలో హోలీ వేడుకలు జరుపుకున్న సుమారు 15 మందికి పైగా యువకులు గోదావరి నది వద్దకు వెళ్లి స్నానాలు పూర్తి చేసుకున్నారు.
అనంతరం కలిసి భోజనాలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో పద్మగూడెం గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి పద్దం ప్రసాద్, ప్రైవేట్ డ్రైవర్ గుండి నాగేశ్వరరావులు స్నానం చేయడానికి మళ్లీ గోదావరిలోకి దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి స్నానం చేస్తూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అయితే వారిని గమనించి కాపాడేందుకు మరో ఇద్దరు మిత్రులు గోదావరిలోకి దిగారు. వారిద్దరి జాడ ఎంతకూ లభించకపోవడంతో చేసేది లేక బయటకు వచ్చారు. తోటి మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గల్లంతైన ప్రసాద్, నాగేశ్వరరావు కోసం సాయంత్రం వరకు వెతికినా ఫలితం లేకపోయింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

