రాష్ట్రంలో 48 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు
రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీటిలో 8 సంఘాలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 48 రిజిస్టర్డ్ సంఘాలుగా వెల్లడించింది.
- వీటిలో ప్రభుత్వ గుర్తింపు పొందినవి 8
- ఆర్టీఐ ద్వారా వెల్లడించిన విద్యాశాఖ
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీటిలో 8 సంఘాలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 48 రిజిస్టర్డ్ సంఘాలుగా వెల్లడించింది. పీఆర్టీయూ టీఎస్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్), టీఎస్ జీహెచ్ఎంఏ, టీఆర్టీఎఫ్, టీఎస్ యూటీఎఫ్, ఎస్టీయూ టీఎస్, టీపీటీఎఫ్, టీఎస్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్లు (టీఎస్ పీటీఏ) సంఘాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు సంఘాలుగా విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యా సంఘాల సమాచారం కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తుచేయగా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ సంఘాల్లో నాలుగింటికి మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఒకే పేరుతో కాస్త పేరు మార్చుకుని పలు సంఘాలుండటం గమనార్హం.
ఒకే పేరుతో సంఘాలు..
- విద్యాశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ టీచర్ యూనియన్స్ రాష్ట్రంలో ఆరు ఉన్నాయి. గిరిజన ఉపాధ్యాయ సంఘాలు మూడు, ఆదివాసీ టీచర్స్ పేరిట ఒక సంఘం నడుస్తున్నది.
- పీఆర్టీటీయూ టీఎస్‌తోపాటు, పేరు మార్చుకుని పీఆర్టీయూ తెలంగాణ పేరిట మరో సంఘం నడుస్తున్నది. ప్రోగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) పేరుతో ఇంకో సంఘం ఉన్నది.
- ఎస్టీయూ పేరిట రెండు సంఘాలున్నాయి. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టీఎస్), తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) నడుస్తున్నాయి.
- యూటీఎఫ్ పేరిట రెండు సంఘాలు నడుస్తున్నాయి. టీఎస్ యూటీఎఫ్, టీయూటీఎఫ్ పేరిట రెండు సంఘాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
- రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ(ఆర్‌యూపీపీ టీఎస్)తో పాటు, ఆర్యూపీటీ టీ, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ టీఎస్) సంఘాలుండగా భాషోపాధ్యాయ సంస్థ పేరిట మరో సంఘం నడుస్తున్నది.
- ఉర్దూ టీచర్ల కోసం ప్రత్యేకంగా మూడు ఉపాధ్యాయ సంఘాలున్నాయి. బహుజన పేరుతోనూ మూడు ఉపాధ్యాయ సంఘాలున్నాయి.
- హెచ్ఎంల కోసం ప్రత్యేకంగా రెండు ఉపాధ్యాయ సంఘాలుండగా, ప్రైమరీ హెచ్ఎంల కోసం పీఈటీలు, పీడీల కోసం మూడు సంఘాలు నడుస్తున్నాయి.
- ప్రైమరీ, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కోసం రెండు సంఘాలు, గవర్నమెంట్ టీచర్ ఆర్గనైజేషన్స్ పేరిట మూడు సంఘాలున్నాయి.
సంఘాల సంఖ్యను తగ్గించండి : పద్మనాభరెడ్డి
రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్యను తగ్గించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సర్కార్‌ను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. శాసనమండలిలో ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నందున ఇన్ని సంఘాలు అవసరంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు 25% సభ్యత్వం ఉండాలనే నిబంధన ఉన్నదని, ఈ లెక్కన నాలుగు సంఘాలకు మాత్రమే గుర్తింపు దక్కే అవకాశమున్నదని, అయినా 8 సంఘాలకు గుర్తింపు దక్కిందని లేఖలో ప్రస్తావించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

