అగ్ర కథానాయిక శ్రీలీలకు వరుసగా అవకాశాలైతే వస్తున్నాయి కానీ..విజయాలు మాత్రం వరించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ భామ తెలుగులో మరో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అగ్ర హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది.
వశిష్ట దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో లాంచ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ నుంచి పలువురు యువ నాయికల పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు శ్రీలీలను ఓకే చేశారని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం శ్రీలీల తమిళంలో ధనుష్ ‘ఓం’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. అలాగే హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటించనుంది.