మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ పాన్ ఇండియా చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నది. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ వీరనారి కమలా రెడ్డి పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్లో శత్రువులను తుదముట్టించి ఉగ్రరూపంలో కనిపిస్తున్నది రమ్యకృష్ణ.
కథాగమనంలో కమలారెడ్డి పాత్ర కీలకంగా ఉంటుందని, ఐకానిక్ క్యారెక్టర్‌గా మిగిలిపోతుందని మేకర్స్ పేర్కొన్నారు. మరియా ర్యబోషప్క, పార్తీబన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తన్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, రచన-దర్శకత్వం: హనుమరెడ్డి యక్కంటి.